శిల్పారామంలో కొన‌సాగుతున్న హ్యాండీ క్రాఫ్ట్స్ మేళా.. అల‌రిస్తున్న సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు..

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్ టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్పా బజార్ హస్తకళల ఉత్సవ్ ఎంతగానో అలరిస్తోంది. డ్రై ఫ్లవర్స్, పటచిత్ర పెయింటింగ్స్, కార్పెట్స్, చెన్నపట్నం చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ పెయింటింగ్ చీరలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. శుక్ర‌వారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత కార్యక్రమం, భరతనాట్య నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి. శ్రీ సద్గురు త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ గురువు మురళి మోహన్ శిష్య బృందం సంగీత కచేరిలో సామజవరా గమన , గరుడగమనా, భాగ్యదా లక్ష్మి, ఎండగని నీడ గని, హిమగిరులే, తిల్లాన పాటలను శ్రీపూజ, సర్వాణి, సంయుక్త, రోహిత్, విశ్వక్సేన్, తన్మయి ఆలపించారు. సంధ్యమోల్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, గణేషకౌతం, అయ్యప్ప వర్ణం, శారదా కౌతం, అలరిపు, శ్రీ కృష్ణ కౌతం, జాతిస్వార్మ్, కల్యాణ రామ, నటేశవర్ణం అంశాలను దీక్షిత, రుత్వి, అక్షద, వేదస్రవంతి, సమీక్ష, అభిజ్ఞ ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here