శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మారబోయిన రాజు యాదవ్, అక్తర్,మహమ్మద్ బేగ్, రాజు యాదవ్ , అష్రాఫ్ , రాజ్ యాదవ్,క్రిశాంక్, పవన్, యాసీన్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు , విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు.