కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ సేవలు అందించేది కేవలం తెరాస పార్టీయేనని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్, కుమ్మరి బస్తీలలో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి హమీద్ పటేల్ తో కలిసి ఆయన ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి హమీద్ పటేల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కేవలం తెరాసతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్దిని చూసి ప్రజలు ఓటేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్, తెరాస నాయకులు శ్రవణ్ యాదవ్, గంగారాం యాదవ్, రాజు యాదవ్ పాల్గొన్నారు.





