చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలా దేవి, కోడలు డాక్టర్ భార్గవిలు చందానగర్ లో తెరాస పార్టీ అధిష్టానం బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తెరాస హయాంలోనే అనేక అభి వృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు,పేదల కోసం అనేక సంక్షేమ కార్య్రమాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ఆరెకపూడి గాంధీ కష్టం తెలిసిన మనిషని, ఎవరు కష్టాల్లో ఉన్నా ముందుండి ఆదుకొనే వ్యక్తి అని అన్నారు. ఆయన ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించారన్నారు. అలాంటి నాయకుడు మనకు లభించడం మన అదృష్టమని అన్నారు. ఎంతో అభివృద్ధికి నోచుకున్న హైదరాబాద్ లో ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తున్నామని, అలాంటి జీవితం కొనసాగాలంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి చందానగర్ డివిజన్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. డివిజన్ అభ్యర్థి మంజుల మాట్లాడుతూ తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.