అన్ని వ‌ర్గాల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్ద పీట‌: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్ని వ‌ర్గాల సంక్షేమానికి తెరాస ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. బుధ‌వారం శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని మ‌సీదుబండ‌లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, నాయ‌కుడు ర‌వి యాద‌వ్‌ల‌తో క‌లిసి గాంధీ ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా గాంధీ మాట్లాడుతూ.. డిసెంబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్న పోలింగ్‌లో తెరాస అభ్య‌ర్థి రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌న్నారు. శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలో ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టామ‌న్నారు. కోట్లాది రూపాయ‌ల‌ను వెచ్చించి డివిజ‌న్‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ను గెలిపిస్తే మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను మ‌రోసారి కార్పొరేట‌ర్‌గా గెలిపించాల‌ని కోరారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, రాగం నాగేంద‌ర్ యాద‌వ్

ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస నాయకులు పద్మారావు, కృష్ణ యాదవ్, పొడుగు రాంబాబు, రమేష్, వేణు మల్లేష్, కొడిచెర్ల రాములు, శ్రీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్, పవన్ నటరాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here