హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ మాత్రమే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 100 శాతం నెరవేరుస్తుందని ఆ పార్టీ హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని జ్యువెల్ గార్డెన్, జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తెరాస చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న వాగ్దానాలను నమ్మవద్దని అన్నారు. నగరంలో వరదలు వచ్చినప్పుడు తెరాస మాత్రమే ప్రజలను ఆదుకుందన్నారు. తెరాస అభ్యర్థులు గెలిస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.