గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేజ్ 1 కాలనీ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో కొమిరిశెట్టి సాయిబాబాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ అమూల్యమైన ఓటును తెరాసకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. డివిజన్ ను అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు దాసరి గోపి, జెరిపాటి రాజు, కట్ల చంద్రశేఖర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, రమేష్, నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యుడు భూషణ్ పాల్గొన్నారు.