శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): నవరాత్రుల సందర్భంగా 6వ రోజు ధనలక్ష్మి అమ్మవారి రూపేనా శ్రీ విజయ వినాయక యూత్ ఆధ్వర్యంలో మియాపూర్ న్యూ కాలనీలో 8,88,888 లక్షల నోట్ల రూపాయలతో అలంకరణ చేశారు. భక్తులందరూ ధనలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ధన ధాన్యాలు, సిరి సంపదలకు లోటు ఉండదని కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు ధనలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.






