శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): ఐటీ పరిశ్రమలు అధికంగా ఉన్న శేరిలింగంపల్లి జోన్‌లో మాల్స్ హాల్స్‌కు ప్రత్యాన్మాయంగా ఆహ్లాదాన్ని అందించేలా పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే థీమ్ పార్కులను అధ్భుతంగా తీర్చిదిద్దినట్లు స్పష్టం చేసారు. జోన్ పరిధిలో జడ్‌సీ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం జడ్‌సీ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ అధ్భుతమైన థీమ్‌లతో రూపొందించిన పార్కులు జోన్‌కే ప్రత్యేకంగా నిలుస్తున్నాయని, వాటి స్ఫూర్తితోనే కాలనీలలోని పార్కులను పూర్తి స్తాయిలో సుందరీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ఆట పరికరాలు, పచ్చదనం, ప్రహరీ గోడలపై అందమైన , వ్యాయామానికి స్ఫూర్తినిచ్చే చిత్రాల పేయింటింగ్ చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ మోహన్‌రెడ్డి, ఈఈ కేవీఎస్ఎన్ రాజు , నాగిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.