గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి ప్రజలు చిరుత సంచరిస్తుందన్న వార్తల పట్ల భయ పడాల్సిన పనిలేదని డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రోడా మిస్త్రీ కళాశాల పరిసరాల్లో చిరుత సంచరిస్తుందన్న వార్తను తెలుసుకున్న ఆయన సోమవారం కళాశాలకు వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునంద మూర్తిని కలిశారు. చిరుతపులిని చూశానని తెలిపిన సిబ్బంది కళావతిని ఆయన పరామర్శించారు.

అనంతరం కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ.. రోడా మిస్త్రీ కళాశాల పరిసరాల్లో అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారని, అందువల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావల్సిన అవసరం లేదని అన్నారు.