రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేళ… నిరుపేద‌ల క‌డుపు నింపిన మంద‌గ‌డ్డ విమ‌ల్‌కుమార్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని శేరిలింగంప‌ల్లి టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, ద‌ళ‌త ప్ర‌ముఖులు మంద‌గ‌డ్డ విమ‌ల్ కుమార్ బుధ‌వారం నిరుపేద‌ల‌కు భోజ‌నం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ఫ‌లితంగా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌లో బాంగారు తెలంగాణ‌గా రూపాంత‌రం చెందుతుంద‌ని అన్నారు. క‌రోనా విప‌త్క‌ర పరిస్థితుల‌ను ఎదుర్కోవ‌డంలో ప్ర‌భుత్వం, ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు శక్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే త‌న వంతుగా లాక్‌డౌన్ కార‌ణంగా తిండికి అవ‌స్థ‌లు ప‌డుతున్న నిరుపేద‌ల‌కు తోచిన రీతిలో భోజ‌నం పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌రోనా వారియ‌ర్ టీమ్ స‌భ్యులు జ్ఞ‌నేశ్వ‌ర్, ముఖుల్ సాయి, వంశీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఒక అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ల‌కు భోజ‌నం పంపిణీ చేస్తున్న మంద‌గ‌డ్డ విమ‌ల్ కుమార్‌, ముఖుల్ సాయి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here