క‌రోనా ర‌క్క‌సికి బ‌లైన ముగ్గురు నేత‌ల‌కు మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్ ఘ‌న‌నివాళి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కరోనా ర‌క్క‌సికి ఇటీవ‌ల‌ బ‌లైన ముగ్గురు శేరిలింగంప‌ల్లి నేత‌ల‌కు మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్ష‌ప‌తి యాద‌వ్, బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్‌యాదవ్‌, గ‌చ్చిబౌలి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డిలు బుధ‌వారం ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ క‌రోనా సెకెండ్ వేవ్ ఉదృతికి ప్ర‌జ‌లు పిట్ట‌లు రాలిన‌ట్టు రాలిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారం రోజుల్లోనే గంగారంకు చెందిన శ్రీశైలం యాద‌వ్‌, రాయ‌దుర్గంకు చెందిన రాజారెడ్డి, మియాపూర్‌కు చెందిన తాండ్ర రాజుగౌడ్‌లు మృతిచెంద‌డం బాదాక‌ర‌మ‌ని అన్నారు. ఆ ముగ్గిరితో ఆత్మీయ‌త‌ను వారు గుర్తు చేసుకున్నారు. ఆ ముగ్గురి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోస్థైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు రాధాకృష్ణ‌యాద‌వ్‌, ఎల్లేష్‌, ర‌ఘునాథ్‌యాద‌వ్‌, హ‌న్మంత్‌నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్రీశైలం యాద‌వ్‌, రాజారెడ్డి, రాజుగౌడ్‌ల చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పిస్తున్న‌భిక్ష‌ప‌తి యాద‌వ్‌, ర‌వికుమార్ యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి, బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here