నిరుపేద యువ‌తి వివాహానికి ప్ర‌భుత్వ విప్ గాంధీ శ్యామ‌ల దేవి దంప‌తుల చేయూత‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బికె ఎనక్లేవ్‌లో నివసిస్తున్న నిరుపేదలు లక్ష్మారెడ్డి, లలిత దంపతుల కుమార్తె రచనరెడ్డి సురేందర్ రెడ్డిల వివాహానికి ప్ర‌భుత్వ విప్ గాంధీ చేయూత‌నందించారు. త‌న స్వంత ఖర్చులతో పెళ్లి కూతురుకు పుస్తె, మట్టెలు, నూతన పట్టు వస్త్రాలను గాంధీ స‌తీమ‌ణి సతీమణి శ్యామల దేవి అంద‌జేసి ఆశీర్వ‌దించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ నిరుపేద త‌ల్లితండ్రుల‌కు ఆడ‌కూతురు పెళ్లి చేయ‌డం ఎంతో భార‌మ‌ని అన్నారు. అలాంటి వారికి ప్ర‌భుత్వం క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ లాంటి ప‌థ‌కంతో బ‌రోసా క‌ల్పిస్తుంద‌ని, ఐతే ఖ‌ర్చులు భారీగా పెరిగిపోయిన నేటి ప‌రిస్థితుల్లో నిరుపేదల వివాహానికి ప్ర‌భుత్వ స‌హ‌కారంతో పాటు ఇత‌రుల తోడ్పాటు ఎంతో అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ వంతు భాద్య‌త‌గా ర‌చ‌నారెడ్డి వివాహానికి తోచిన స‌హ‌కారం అందించామ‌ని అన్నారు.

ర‌చ‌నా రెడ్డికి బొట్టు పెట్టి పుస్తె మెట్టెలు, నూత‌న వ‌స్త్రాలు అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here