జూనియ‌ర్ ఆర్టీస్టుల‌కు ఎంఎస్ఎం ట్ర‌స్టు చేయూత… 200 కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా విజృంభ‌న వేళ ఉపాధి కోల్పోయి అవ‌స్థ‌లు ప‌డుతున్న జూనియ‌ర్ ఆర్టీస్టుల‌కు ఎంఎస్ఎం ట్ర‌స్టు చేయూత‌నందించింది. ట్రస్ట్ కార్య‌ద‌ర్శి, బీజేపీ రాష్ట్ర‌ నాయకులు యం.రవి కుమార్ యాదవ్ దాదాపు రెండు వంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టీస్టుల కుటుంబాల‌కు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో కరోనా సంక్షోభం వల్ల షూటింగులు ఆగిపోయి జూనియర్ ఆర్టిస్టులు ఉపాధి లేక‌ ఇబ్బందులు పడుతున్నారని ఛాంబర్ సభ్యులు నరేష్, రాజు, రాము త‌మ దృష్టికి తెచ్చార‌ని అన్నారు. ప్రేక్ష‌కుల ఆనందం కోసం అహ‌ర్నిష‌లు క‌ష్టించే ఆర్టీస్టులు ఆక‌లి బాద త‌న‌ను క‌ల‌చి వేసింద‌న్నారు. ఒక సినిమా పూర్తి కావడానికి ఎంతో మంది కష్టం ఉంటుంద‌ని, కరోనా కష్ట కాలంలో షూటింగులు లేక ఇబ్బందులు పడుతున్న జూనియర్ ఆర్టిస్టులకు త‌మ‌ వంతుగా తోచిన స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, నాయ‌కులు బాలా కుమార్, రంగస్వామి, నర్సింగ్, తెలుగు సినీ, డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జూనియ‌ర్ ఆర్టీస్టుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్నఎంఎస్ఎం ట్ర‌స్టు కార్య‌ద‌ర్శి ర‌వికుమార్ యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, రాధ‌కృష్ణ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here