శిల్పా ఎన్‌క్లేవ్ శ్రీ ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి దేవాల‌యంలో నిరాడంబ‌రంగా సంక‌టహ‌ర చ‌తుర్థి పూజ‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో సంకట‌హ‌ర‌ చతుర్థిని పుర‌స్క‌రించుకుని శ‌నివారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు వేదుల ప‌వ‌న కుమార‌శ‌ర్మ బృందం ఉదయం 8 గంట‌ల‌కు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కల్యాణం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్ర‌త్యేకంగా అలంక‌రించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేరు. పురోహితులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ పూజ‌లు నిర్వ‌హించారు.

శ్రీ సిద్ధీ బుద్దీ స‌మేత శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క స్వామి క‌ల్యాణం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here