న్యూ కాల‌నీలో ప‌ర్య‌టించిన కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌… స‌మ‌స్య‌లు వివ‌రించిన కాల‌నీవాసులు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనిలో స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ ఆదివారం ప‌ర్య‌టించారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. ప్ర‌ధానంగా రోడ్లు, డ్రైనేజి సమస్యలను కాల‌నీవాసులు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేట‌ర్ ప్ర‌ధాన్య‌త క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌ర్కమ‌య్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం సంబంధిత అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల తీవ్ర‌త‌ను వివ‌రించారు. త్వ‌రితగ‌తిన వాటిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌ విశ్వనాథ్‌, వార్డు మెంబ‌ర్ వ‌ర‌ల‌క్ష్మీ, నాయకులు బిఎస్ఎన్ కిర‌ణ్ యాద‌వ్, చిన్న, రాజు గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న న్యూ కాల‌నీ వాసులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here