ప్ర‌భుత్వ విప్ గాంధీని క‌లిసిన మ‌ధుర‌న‌గ‌ర్, ప్ర‌శాంతిహిల్స్‌, టీఎన్‌జీఓ కాలనీల వాసులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆద్వ‌ర్యంలో స్థానిక‌ మధుర నగర్, ప్రశాంతి హిల్స్, టీఎన్‌జీఓ కాలనీ వాసులు ఆదివారం ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీని క‌లిశారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని గాంధీకి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ప్ర‌ధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ విగ్ గాంధీ దృష్టికి తీసుకువ‌చ్చారు. స్పందించిన గాంధీ సంబంధిత అధికారుల‌తో మాట్లాడి ఆయా కాల‌నీల్లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, విజయలక్ష్మీ, గోవింద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీకి విన‌తీ ప‌త్రం అంద‌జేస్తున్న మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా, మ‌ధుర‌న‌గ‌ర్, ప్ర‌శాంతిహిల్స్‌, టీఎన్‌జీఓ కాలనీల వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here