- గంగారం-దీప్తీశ్రీనగర్‌ల మధ్య అర్ధరాత్రి నిలిచిపోనున్న రాకపోకలు…
నమస్తే శేరిలింగంపల్లి: గంగారం, మదీనగుడ మధ్యలో కొనసాగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆదివారం జాతీయ రహదారిని కొంత మేర మూసివేస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. అదివారం రాత్రి 10 నుంచి సోమవారం తెల్లవారు జాము 5 గంటల వరకు గంగారం సిగ్నల్ నుంచి దీప్తీ శ్రీనగర్ యూటర్న్ వరకు రహదారిపై రాకపోకలకు అనుమతి లేదని తెలిపారు. ఆల్విన్ కాలనీ జంక్షన్ నుంచి బిహెచ్ఈఎల్ జంక్షన్ మధ్యలో రాకపోకలు సాగించే లైట్ మోటార్స్ వెహికిల్స్ వయా మదీనగూడ, దీప్తీ శ్రీనగర్, పీజేఆర్ ఎన్‌క్లేవ్ రోడ్ మీదుగా ప్రయాణించాలని సూచించారు. భారీ వాహనాలను మాత్రం రాహదారిపైనే నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. సోమవారం ఉదయం వరకు పనులను పూర్తిచేసి రాకపోకలను పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. ఈ అంతరయాన్ని వాహనదారులు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. ఐతే జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా మంజీరా రోడ్డును సైతం ఉపయోగించుకోవచ్చని, అదేవిధంగా పాత ముంబయి రహదారిలో మసీద్‌బండ, కొత్తగూడ మీదుగా ఆల్విన్ కాలనీ చౌరస్థాకు చేరుకోవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్త పరిచారు.