శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని భవిత సెంటర్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి పుష్పంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్ లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మన భారతదేశ చరిత్ర పుటలలో కీర్తి కిరీటాలుగా నిలిచి పోయిన కొద్ది మంది నేతలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రముఖుడని అన్నారు. ఆయన 1897 సంవత్సరములో జనవరి 23వ తేదీన ఒరిస్సాలోని కటక్ పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. నేతాజీ చురుకైన, తెలివైన విద్యార్థి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ICS 4వ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో వారి అదుపాజ్ఞలలో పనిచేయటం ఇష్టం లేక లండన్ లో ICS ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివచ్చి గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ అధ్యాపకురాళ్ళు వెంకటరమణమ్మ, అబీదా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉమా చంద్రశేఖర్, వాణి సాంబశివరావు, పాలం శ్రీను, కృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
