నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ రూ.2 కోట్ల నిధుల అంచనా వ్యయంతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జలమండలి అధికారులతో కలిసి మంచినీటి పైపులైన్ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఏర్పడిన మంచి నీటి సమస్య త్వరలోనే పరిష్కారం కానుందని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. నవోదయ కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీటి నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం రాజశేఖర్, డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ యాదయ్య,టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, సురేందర్, జగదీష్, రమేష్, లక్ష్మణ్ నవోదయ కాలనీ అధ్యక్షుడు ప్రకాశ్ , కార్యదర్శి ఎండీ ముక్తర్ అహ్మద్, రామచంద్రయ్య, కృష్ణ రావు, మహేష్ , రాజు, వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మురళి కృష్ణ, వసంత్ కుమార్ యాదవ్, సూర్యనారాయణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.