కొత్త‌గూడ‌లో ప‌ర్య‌టించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌-స్థానిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో బుధవారం స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ పర్యటించారు. కొత్తగూడ గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తరచుగా తలెత్తుతున్న సమస్యలను ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు‌‌. డ్రైనేజీ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడతామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. సఫారీ నగర్ పోలీస్ బేటాలిన్ ప్రాంతం వద్ద ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, సెక్రటరీ జె బలరాం యాదవ్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఈఈ సుదర్శన్, డీఈ రమేష్, ఏఈ ప్రతాప్, స్థానిక నాయకులు ఊట్ల కృష్ణ, జంగం గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రవి ముదిరాజ్, నీలం మధు, భీమని శ్రీను, నీలం లక్ష్మి నారాయణ, నీలం లక్ష్మణ్, నీలం మధు, రఘు, నవీన్, చిన్న, వినయ్, గొడుగు సత్యం, నీలం అశోక్, నరేందర్, సురేష్, తిరుపతి యాదవ్, శ్రీను, మతిన్, వివి రావు, నయీమ్,జానీ, అజామ్, నుర్షద్, పుణ్యవతి, సంగీత, రఫియా, పావని, సంధ్య, సునీత, షహీదా, చాకలి గోపి, రేగుల గోపి, జ్ఞానేశ్వర్, రఘు, భుజంగం కొత్తగూడ గ్రామస్థులు పాల్గొన్నారు.

కొత్తగూడ గ్రామంలో పాదయాత్ర చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here