నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కంచ గచ్చిబౌలి నవోదయ కాలనీలో పనిచేసే కార్మికులు, నిరుపేదలకు మారబోయిన సందయ్య మెమోరియల్ ట్రస్టు చేయూతనందించింది. ట్రాస్టు కార్యదర్శి, బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవి కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డిలు పెద్దసంఖ్యలో నిరుపేద కుటుంబాలకు ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తోచిన సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు ఆర్ కే వై ప్రాణహేతు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, భోజనం, మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లాక్‌డౌన్ ముగిసిందని ప్రజలు అప్రమత్తను కోల్పోవద్దని, కరోనా వైరస్ పూర్తిగా నాశనం అయ్యేంతవరకు ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమేష్, నాగరాజు, విజయ్ బసని, నవోదయ కాలనీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రావు, సభ్యులు శంకర్, ఫనీంద్ర, మారుతి రెడ్డి, వెంకట్, జీవన్ రాజు, అనంతయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.