క‌రోనా వ‌ల్ల ఆర్ధిక‌ ప‌రిస్థితి దెబ్బ‌తిన్నా ఆగ‌ని సంక్షేమ ప‌ధ‌కాలు: ప్ర‌భుత్వ విప్ గాంధీ

  • శేరిలింగంపల్లికి రూ.11.94 ల‌క్ష‌ల ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి… ల‌బ్ధిదారులకు చెక్కుల‌ పంపిణీ…

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎంరిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద‌మొత్తంలో నిధులు మంజురయ్యాయి. ఈ క్ర‌మంలో రూ.11.94 ల‌క్ష‌ల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను ఆదివారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ 22 బాధిత కుటుంబాల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోను ముఖ్య‌మంత్రి స‌హాయనిధి పంపిణీలో ఎక్క‌డ జాప్యం లేద‌ని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందనిపేర్కొన్నారు. క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతున్న‌ప్ప‌టికి, లాక్‌డౌన్ వ‌ల్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ కుదేల‌వుతున్నా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌మొత్తంలో నిధులు మంజురు చేస్తున్న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, కోనేరు కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ, రాంచందర్ రావు, సురేందర్, రాము తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పొందిన ల‌బ్ధిదారులు వీరే…
1) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం కి చెందిన వర్ష – 2 ,00 ,000 /-
2 ) కుక‌ట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కి చెందిన తులసి -1 ,00 ,000 /-
3) వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర నగర్ కి చెందిన స్నేహ – 96 ,000 /-
4) వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ కాలనీకి చెందిన జయరాం – 60 ,000 /-
5) కుక‌ట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కి చెందిన ముత్తమ్మ – 60 ,000 /-
6) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారనగర్ కి చెందిన శ్రీనివాస్ – 60,000 /-
7) వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర నగర్ కి చెందిన స్రవంతి – 60 ,000 /-
8) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన శ్రీకాంత్ – 60 ,000 /-
9) కుక‌ట్‌ప‌ల్లిడివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కి చెందిన హెన్రీ ఆరోకీయ దాస్ – 60 ,000 /-
10) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ చెందిన రాధికా – 60,000 /-
11) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన శివ కుమార్ – 60,000 /-
12) చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కి చెందిన సుమిత్ర – 50 ,000 /-
13) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన థైనియత్ – 48,000 /-
14) కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కి చెందిన మధు – 40,000 /-
15) కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కి చెందిన లక్ష్మి -26 ,000 /-
16) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ -2 చెందిన రుక్కమ్మ – 23,500 /-
17) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తత్రేయ నగర్ కు చెందిన లలితమ్మ – 23 ,000 /-
18) హ‌ఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ కి చెందిన రవీందర్ -20,000 /-
19) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కి చెందిన జాఫర్ – 19 ,000 /-
20) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన వెంకయ్యమ్మ -15 ,500 /-
21) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన వెంకటేశం -9,0000 /-
22) హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ కి చెందిన మమత – 44,000/-

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here