శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల వెజిటబుల్ మార్కెట్ లో నూతనంగా చేపడుతున్న పునర్నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వెజిటబుల్ మార్కెట్ ను అన్ని హంగులతో సకల సౌకర్యాలతో సుందరీకరణతో ఆదర్శంగా తీర్చితిద్దుతామని తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనులను గుర్తించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వినియోగదారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, మార్కెట్ లో స్వచ్చమైన , ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, మార్కెట్ ను సుందర శోభితవనం గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కే రాంచందర్, విష్ణువర్ధన్ రెడ్డి, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, రషీద్, అజీమ్, అస్లాం, శ్రీనివాస్, శంకర్, ఆంజనేయులు, అజామ్, సాయి, మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






