శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): నవభారత్ నగర్ కాలనీ – కాకతీయ హిల్స్ రోడ్ వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ హెచ్చరించారు. మాదాపూర్ డివిజన్ నవభారత్ నగర్ కాలనీ ప్రజలు గత 30 నుండి 40 ఏళ్ళుగా ఉపయోగిస్తున్న నవభారత్ నగర్ – కాకతీయ హిల్స్ రోడ్ ను ప్రైవేట్ ప్రాపర్టీ అని కొందరు వ్యక్తులు ప్రజల రాకపోకలను నిలిపివేస్తూ రోడ్ ను మూసివేయడంవల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలియజేయగా, కాలనీ ప్రజలు , స్థానిక నాయకులతో కలిసి రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవభారత్ నగర్ కాలనీ వాసులు దాదాపు 40 ఏండ్లుగా కాకతీయ హిల్స్ కాలనీ మీదుగా వెళ్లే రోడ్ ను ఉపయోగిస్తున్నారని, తాము గతంలో కాలనీ సమస్యలపై, పాదయాత్ర సమయంలో కూడా అదే రోడ్ ను ఉపయోగించామని తెలిపారు.
ఇప్పుడు అది ప్రైవేట్ ప్రాపర్టీ అని రాత్రికి రాత్రి ఇరువైపుల రోడ్ ను మూసివేసి, ప్రజలకు వేరెవైపు నుండి రోడ్ మార్గం చూపిస్తామని నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ రోడ్ ను ఏర్పాటు చేయకపోగా ఇంతవరకు ఉన్న రోడ్డు ను మూసివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆ ప్రైవేట్ ప్రాపర్టీ యజమానితో మాట్లాడడం జరిగిందని, 10 రోజుల్లో కాలనీ వాసులకు రోడ్ సౌకర్యం కల్పించాలని ,లేనిపక్షంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగిందన్నారు. జోనల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు తెరిచే పోరాటం చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ వేణు గోపాల్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, సీనియర్ నాయకులు మహేందర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ రెడ్డి, సుమన్ నాయక్, సెక్రటరీ సత్యనారాయణ, లక్ష్మణ్, వినోద్, గణేష్ రెడ్డి, శ్రీనివాస్, సతీష్, సాయి, స్థానిక కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.