స‌హ‌జ‌సిద్ధ వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ‌లో సుమధుర ఆక్రోపోలీస్ అపార్టుమెంట్స్ లో రూ. 1 కోటి 30 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 295 KW (కిలోవాట్) రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రకృతి సహజ సిద్ధమైన వనరులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తరిగిపోతున్న వనరుల తరుణంలో సహజ సిద్దమైన సౌర శక్తిని వాడుకొని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. 295 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసిన మొట్టమొదటి అపార్ట్మెంట్ ఇదే కావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. సుమధుర అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను PAC చైర్మన్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రిపగడ సత్యనారాయణ, మల్లేష్, నగేష్, సల్లావుద్దీన్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, పింటు, మహేందర్, జాకీర్, సుమధుర ఆక్రోపోలిస్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు చైర్మన్ శ్రీరామ రావు, వైస్ చైర్మన్ ప్రదీప్ కుమార్, సెక్రెటరీ డి వి రెడ్డి, డైరెక్టర్లు విజయ, రాజ్ కుమార్, JS రావు, అభిషేక్, మనోహర్ రెడ్డి, నితిన్ శర్మ , అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here