సరళమైన పద్దతుల్లో విద్యనభ్యసించాలి – నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శారని

నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టపడి చదివి భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించాలని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పి. శారని సూచించారు. మదీనగూడలోని నారాయణ ఉన్నత పాఠశాలలో సఫలత కారాస్త అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ పి శారని హాజరై పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఎలా విజయం సాధించాలో, ఎలాంటి శిక్షణ అవసరమో అనే అంశాలపై అవగాహన కల్పించారు. సులభమైన మార్గాలను సూచిస్తూ ప్రేరణ ఇచ్చారు. విషయ నిష్ణాతులచే సరళమైన పద్దతుల్లో చదివేలా విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జీఎం గోపాలరెడ్డి, ఏజీఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మేరీ రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here