శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పటాన్‌చెరు నియోజకవర్గంలను అనుసంధానం చేస్తూ భెల్ (BHEL) సమీపంలో జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన ఇటు చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉందని, ఈ వంతెనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం విశేష కృషిచేసిన ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి లేదా భారతదేశ అమ్మవారిగా కీర్తి గడించిన భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేర్లను పరిశీలించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని కలిగించేలా ఆవిష్కరణ వరకు వంతెనకు పేరు ఖరారు చేయాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను అసెంబ్లీ లోని ఛాంబర్ లో కలిసి టీపీసీసీ కార్యదర్శి సామ్యూల్ కార్తీక్ వినతి పత్రం అందజేశారు. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.