
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి బుదవారం నల్లగండ్ల, నానక్‌రామ్‌గూడ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామల ప్రజలు కార్పొరేటర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక పెద్దలతో కలసి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్థులు కార్పొరేటర్‌కు వివరించారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యను గుర్తించిన గంగాధర్‌రెడ్డి ప్రాధాన్యతా క్రమంలో వాటన్నింటిని పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
