నమస్తే శేరిలింగంపల్లి: బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉరేళ్ల మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యను వారి నివాసంలో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. మహేష్ యాదవ్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కృష్ణయ్య బీసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మహేష్ యాదవ్‌ను యువతకు స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.
