నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెప్పారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో ప్రజా సమస్యలపై బస్తీ బాట చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరును పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాజ్ రెడ్డి, చిన్నం రాజు, నరేందర్ రెడ్డి, నర్సింగ్ నాయక్, నల్లగండ్ల వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.