నాలాల విస్త‌ర‌ణ‌, పూడికతీత ప‌నుల‌ను ప‌రిశీలించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. డివిజ‌న్ పరిధిలోని పంచవటి కాలనీలో కొన‌సాగుత‌న్న‌ నాల విస్తరణ పనులను, రాయ‌దుర్గంలోని వెస్టర్న్ ప్లాజా వద్ద కొన‌సాగుతున్న‌ నాల పూడికతీత పనులను, ప్రశాంత్ హిల్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను మియాపూర్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, స్థానిక మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా, అధికారుల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. అదేవిధంగా హ‌ఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ప్రధాన రహదారి కల్వర్ట్ వద్ద జరుగుతున్న నాల పూడికతీత ప‌నుల‌ను గాంధీ ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారీ వ‌ర్ష‌సూచ‌న‌ల నేప‌థ్యంలో నాలాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించామ‌ని అన్నారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డ‌కుండా జాగ్ర‌త్త చర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు శ్రీకాంతిని, సుదర్శన్, డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, నాయకులు రమేష్, గోవింద్,విజయలక్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

పంచ‌వ‌టీ కాల‌నీలో నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
మ‌దీన‌గుడ వ‌ద్ద నాలా పూడిక తీత ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, అధికారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here