క‌ల్న‌ల్ సంతోష్ బాబుకు నివాళులర్పించిన‌ బిజెపి రాష్ట్ర నాయ‌కుడు ర‌వికుమార్ యాద‌వ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌ల్న‌ల్ సంతోష్ బాబుకు బిజెపి రాష్ట్ర నాయ‌కులు ఎం.ర‌వికుమార్ యాద‌వ్ ఘ‌న నివాళుల‌ర్పించారు. చైనా స‌రిహ‌ద్దులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రుడైన భార‌త జ‌వాన్ క‌ల్న‌ల్ సంతోష్ బాబు ప్ర‌థ‌మ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని మ‌సీద్‌బండ‌లో ఆయ‌న చిత్ర‌ప‌టం వ‌ద్ద బిజెపి నాయ‌కులు శ్ర‌ద్ధాంజ‌లి ఘటించారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ మన భారత సైనికులు దేశాన్ని ఒక కుటుంబంలా చూసుకుంటూ, దేశ ప్రజలకోసం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స‌రిహ‌ద్దులో పోరాడుతున్నార‌ని అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన వారిని ప్రజలు ఎప్పుడు వారి గుండెల్లో పెట్టుకుంటార‌ని అన్నారు. అలంటి అమ‌ర వీరుడు సంతోషుబాబు ఆత్మకి శాంతి చేకూరాల‌నీ భ‌గ‌వంతుడుని ప్రార్ధించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్‌, ర‌ఘునాథ్ యాదవ్, నాయ‌కులు బాల కుమార్, వినోద్ యాదవ్, గణేష్, జాజిరావు శ్రీను జాజిరావు రాము చంద్రమాసిరెడ్డి, బాలు యాదవ్,శ్రీధర్ పటేల్, శ్రీహరి యాదవ్, రాజు, జగన్, అర్జున్, శ్రీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌సీద్‌బండ‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here