బిజెపి మేడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మ‌హిళా మోర్చ కార్య‌ద‌ర్శిగా ఉప్ప‌ల విద్యా క‌ల్ప‌న ఏకాంత్‌గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెపి మ‌హిళా మోర్చా మేడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా కార్య‌దర్శిగా శేరిలింగంప‌ల్లి నియోజక‌వ‌ర్గం వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్‌కు చెందిన ఉప్ప‌ల‌పాటి విద్యా క‌ల్ప‌న ఏకాంత్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు పన్నాల హరిచంద్ర రెడ్డి గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డిల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జిల్లాలో బిజెపి, మ‌హిళా మోర్చా అభివృద్ధికి శ‌క్తివంచన లేకుండా కృషి చేస్తాన‌ని అన్నారు. మ‌హిళ సాధికార‌తే ల‌క్షంగా ముందుకు సాగుతాన‌ని, త‌న‌పై అధిష్టానం ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని అన్నారు.

బిజెపి మేడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మ‌హిళా మోర్చ కార్య‌ద‌ర్శిగా ఉప్ప‌ల విద్యా క‌ల్ప‌న ఏకాంత్‌గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here