నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లో దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి రామకృష్ణ నగర్ మీదుగా మదీనగూడ మెయిన్ రోడ్డు దీప్తి శ్రీ నగర్ నాలా వరకు రూ.15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కిలోమీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనులను, డ్రైనేజీ సమస్యను జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా యుద్ధ ప్రాతిపదికన నాలా విస్తరణ పనులను చెప్పటడం జరుగుతుందన్నారు. హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలో ముందుంచుతామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన, మెరుగైన జీవన విధానాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, కాలనీ అధ్యక్షుడు ఉమామహేశ్వర రావు, బాలకృష్ణ, సురేందర్, వెంకటరమణ, మున్నా, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
