నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన మలిదశ ఉద్యమంలో కొండకల్ శంకర్ గౌడ్ సేవలు మరవలేనివని, శేరిలింగంపల్లి నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొండకల్ శంకర్ గౌడ్ 53వ జయంతి వేడుకలను చందానగర్ లోని సుప్రజ హోటల్ లో టీఆర్ఎస్ నాయకులు తిరుమలేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కొండకల్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించిన కొండకల్ శంకర్ గౌడ్ మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు.
మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి శంకర్ గౌడ్ అన్నారు. చివరి శ్వాస వరకు టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడు అన్నారు. శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, కొండాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, నమస్తే శేరిలింగంపల్లి వ్యవస్థాపకుడు పుట్ట వినయ్ , నాయకులు మిద్దెల మల్లా రెడ్డి , గంగాధర్ రెడ్డి, మోహన్ ముదిరాజ్ , విమల్ కుమార్ , పీవై రమేష్, వేణు, గుడ్ల ధనలక్ష్మి ,జంగం గౌడ్,,హాఫీజ్ పెట్ డివిజన్ ఎస్.సి సెల్ అధ్యక్షులు కంది జ్ఞనేశ్వర్, బలరాం యాదవ్, వజిర్, రాజు, బెనర్జి, బాబుమోహన్ మల్లేష్, కనకమామిడి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, దిలీప్ కుమార్, శ్రీనివాస్, దేవరాజ్, నరేందర్, గోవుల రాజు, దేవేందర్, కృష్ణ, అంబేద్కర్, మధు, సతీష్ ముదిరాజ్, ఉమేష్, భాను, రోహిత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.