నమస్తే శేరిలింగంపల్లి: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మేమున్నామంటూ ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న హోప్ ఫౌండేషన్ సేవలు మరవలేనివని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. చందానగర్ లో ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా జీవనం సాగిస్తున్న మంగలి శ్రీనివాస్ కు హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ చేయూత కల్పించారు. మంగలి శ్రీనివాస్ కు ఎంపీ రంజిత్ రెడ్డి చేతుల మీదుగా రూ. 20 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతుందన్నారు. పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు అండగా నిలుస్తున్న హోప్ ఫౌండేషన్ నిర్వాహకులు కొండా విజయ్ ను ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
