నమస్తే శేరిలింగంపల్లి:త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకునే విధంగా మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్లలో ఉన్న ఈద్గాలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ ఈద్గా, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీ ఈద్గా వద్ద జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టిన పనులను డీఈ సురేష్ తో కలిసి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మైనార్టీలు సమగ్రాభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు మొహమ్మద్ కాసిం, వార్డ్ సభ్యులు రహీం, నాయకులు లియాకత్, షోయబ్, మైనారిటీ నాయకులు సలీం, జాఫర్, యూత్ నాయకులు ఖాజా, వర్క్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ,శ్రీధర్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.