నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీన గూడ మెయిన్ రోడ్డు లో సాగుతున్న నాలా పనులను స్థానిక నాయకులతో కలిసి మంగళవారం హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు మునగకుండా రాష్ట్ర ప్రభుత్వం నాలాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. వర్షాకాలంలో కాలనీలు, బస్తీలు ముంపునకు గురి కాకుండా ముందస్తుగా నాలాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, నారాయణ రెడ్డి, గోపాల్ తదితరులున్నారు.