నమస్తే శేరిలింగంపల్లి: కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో కలిసి హిమాయత్ సాగర్ నుండి చిలుకూరు వరకు 12 కి.మీ. పాదయాత్ర కొనసాగినట్లు కసిరెడ్డి భాస్కర రెడ్డి తెలిపారు. యాత్ర పొడవునా కార్యకర్తలు, ప్రజల ఉత్సాహం చూస్తుంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీదే అధికారమని తేటతెల్లమవుతుందని అన్నారు. టిఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు, బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎంచుకుంటున్నారు అనడానికి పాదయాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనం అని అన్నారు.