మున్నూరు‌కాపు సంఘం బలోపేతానికి పాటుపడుదాం

నమస్తే శేరిలింగంపల్లి: మున్నూరు కాపు సంఘం బలోపేతానికి ప్రతి సభ్యుడు పనిచేయాలని మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు సూచించారు. హఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సభ్యుడు కుల సంఘం అభివృద్ధి కి కృషి చేయాలని, మున్నూరు కాపు సంఘంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని సంఘం పెద్దలు పేర్కొన్నారు. కాపు సంఘాల వారికి ఎవరికి ఏ ఆపద వచ్చినా తోడుగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలవాలని, కాపుల అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆర్థికంగా వెనుకబడిన వారికి, రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వారికి సహకరించుకోవాలి అని సంఘం పెద్దలు అన్నారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత,‌ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, యూసఫ్ గూడ కార్పొరేటర్ రాజకుమార్ పటేల్, కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్, రాజ రాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కొండ దేవయ్య పటేల్, కొండాపూర్ డివిజన్ జనరల్ సెక్రెటరీ పెరుక రమేష్ పటేల్, సిద్దిపేట జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు ఆకుల యాదగిరి, పోలీస్ ఆఫీసర్ అల్లం కిషన్ రావు పటేల్, పెరుక రవీందర్ పటేల్, శ్రీ కృష్ణా నగర్ మున్నూరు కాపు సంఘము ప్రెసిడెంట్, వాసాల వెంకటేశ్వర్ పటేల్, శేరిలింగంపల్లి కోఆర్డినేటర్, వాసాల రాజు పటేల్ జూబ్లీహిల్స్ కోఆర్డినేటర్, లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

హఫీజ్ పెట్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం

హఫీజ్ పెట్ మున్నూరు కాపు సంఘం నూతన గౌరవ సలహాదారులుగా పిల్లి రాజయ్య పటేల్, నూతన అధ్యక్షునిగా పోగుల సత్యనారాయణ‌ ఎన్నికయ్యారు
ఉపాధ్యక్షులు మంగళవారపు ఐలయ్య, బత్తుల రవి, కాశెట్టి వెంకటేష్. తాడం మహేందర్, గాజుల మధుసూదన్, జనరల్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, కోశాధికారి కాశెట్టి ఆంజనేయులు, ఉప కార్యదర్శి పూల శ్రీనివాస్ ఎంపికయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here