నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలను పెంచుతూ చెట్లను కాపాడుతుంటే కొందరు ఇష్టారీతిగా భవనాలకు చెట్లు అడ్డు ఉన్నాయంటూ నరికివేయడం దారుణమని టీఆర్ఎస్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ ప్లాట్ నంబర్ 310 వద్ద ఓ భవనానికి చెట్లు అడ్డుగా ఉన్నాయంటూ ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేసిన సంబంధిత అధికారులపై, భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు చందానగర్ డీసీ సుదాంష్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు అవినీతికి అలవాటు పడి భవన యాజమానికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. చెట్లను నరికిన విద్యుత్ శాఖ అధికారులపై, భవన నిర్మాణదారుని పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.