అందరు నేతలు అంబేద్కర్ యాదిలో… వర్ధంతి వేళ రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి…

నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత,‌ బడుగుబలహీన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 65 వ వర్థంతిని పురస్కరించుకొని శేరిలింగంపల్లిలో వాడవాడలా నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు మంజులరఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, దళిత నేత మందగడ్డ విమల్ కుమార్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,  నాయకులు మంద గడ్డ విక్రమ్ కుమార్, డాక్టర్ యాదయ్య, మిరియాల రాఘవరావు, జనార్ధన్ రెడ్డి, నాగరాజు, రవీందర్ రెడ్డి, ప్రవీణ్, ఓ.వెంకటేష్, దొంతి శేఖర్, వెంకటేష్, కంది జ్ఞానేశ్వర్, మల్లేష్ గుప్తా, సుధాకర్, రాములు, దాస్, కార్తీక్ గౌడ్, దీక్షిత్ రెడ్డి, సికెందర్ , వరలక్ష్మి, పార్వతి, రాఘవేందర్, నర్సింగ్ రావు, మహేందర్, ఉదయ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు

వేమన వీకర్ సెక్షన్‌ కాలనీలో..
చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాలనీ వాసుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతిని నిర్వహించారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , టీఆర్ఎస్ నాయకులు ఓ వెంకటేష్ , పుల్లిపాటి నాగరాజు, రవీందర్ రెడ్డి, దాస్, అమిత్, వరలక్ష్మి రెడ్డి, హరిత తదితరులు పాల్గొన్నారు.

వేమన వీకర్ సెక్షన్ ‌కాలనీలో అంబేద్కర్ వర్థంతిలో పాల్గొన్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

మియాపూర్ డివిజన్ లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,  నాయకులు కె.చంద్రయ్య, బిఎస్ ఎన్ కిరణ్ యాదవ్, రవీందర్ రెడ్డి, నాగరాజు, జీతయ్య, నర్సింగ్ రావు, శ్రీధర్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, నర్సింహ గౌడ్, బిక్షపతి, ప్రభాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ మక్తమహబూబ్ పేట్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

నడిగడ్డ తండాలో
నడిగడ్డ తండాలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా బస్తీ వాసులు స్వామి నాయక్, సుధాకర్, దశరథ్, కమలాకర్, అబ్రహం, రవి, శ్రీను, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

నడిగడ్టతండాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఎంఏ నగర్ లో…
భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సంద్భంగా ఎంఏ నగర్ లో ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ పార్టీ
డివిజన్ కమిటీ రాంబాబు, ఎంఏ నగర్ బస్తీ కమిటీ సభ్యులు రాములు దశరథ్, దళిత సంఘ నాయకుడు లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎంఏ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఏఐఎఫ్ డీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి

స్టాలిన్ నగర్ లో..
స్టాలిన్ నగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కుంభం సుకన్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మేడం శెట్టి రమేష్, అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

స్టాలిన్ నగర్ లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న దృశ్యం

అంబేద్కర్ నగర్ లో…
సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధి అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజ్, మోహన్, కృష్ణ, రమేష్, బీంసేన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజ‌న్ పరిధిలో నిర్వహించిన అంబేద్కర్ వర్థంతిలో పాల్గొని నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

సీపీఐ ఆధ్వర్యంలో…
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్థంతిని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇజ్జత్ నగర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి శేరిలింగంపల్లి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.

ఇజ్జత్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here