నమస్తే శేరిలింగంపల్లి: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా వివిధ ప్రాంతాలలో గల పార్క్ లలో హరితహారం నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగంగా పార్క్ ను సుందరవనం, శోభిత వర్ణంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు తప్పనిసరిగా నాటాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ లు నాగేష్ నాయక్, కార్తీక్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణాగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, తిరుపతి యాదవ్, పత్రిక నగర్ వాసులు శ్రీనివాస రావు, రామ కోటయ్య, సుధాకర్, నాగేశ్వర రావు, ఆంజనేయులు, చంద్రకాంత్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.