మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన ప్ర‌భుత్వ విప్ గాంధీ… శేరిలింగంప‌ల్లి అభివృద్ధి, ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేకంగ చ‌ర్చ‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ శ‌నివారం మంత్రి కేటీఆర్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అభివృద్ధి, క‌రోనా పరిస్థితుల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. వర్షకాలం నేపథ్యంలో వ‌ర‌ద‌ముంపు స‌మ‌స్య‌ల పరిష్కారానికై నాలాల నిర్మాణ పనులకు అధ‌నంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులు వేగవంతం చేసేలా అధికారుల‌ను ఆదేశించాల‌ని కోరారు. అదేవిధంగా ప్రజారోగ్యం దృష్ట్యా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, బస్తి ధవాఖానాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్ర‌ధానంగా క‌రోనా ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వాడ‌వాడ‌ల‌ వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రిని ప్ర‌త్యేకంగా కోరారు. త‌న అభ్య‌ర్థ‌న‌ల‌కు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని గాంధీ తెలిపారు.

మంత్రి కేటీఆర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here