నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కరీం మెడికల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్ యస్ క్లినిక్ ను కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ యువజన నాయకులు ఆదిల్ పటేల్ మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులలో డాక్టర్ల సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఆదిల్ పటేల్ అన్నారు. డాక్టర్లు దేవునితో సమానమని, సమాజానికి వారు చేస్తున్న సేవలు, కృషి మరువలేనివని పేర్కొన్నారు. బస్తీలలో, కాలనీలలో ఉండే పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిత్య వైద్య సేవలు అందించే డాక్టర్లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్ యస్ క్లినిక్ డాక్టర్లు జోహ ఫాతిమా, రఫియా ఫాతిమా, ఫయాజూద్దీన్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అక్రమ్, రియాజ్, సలీం పటేల్, మస్తాన్ పటేల్, షరీఫ్, వసీమ్, నరేష్ ఖాజా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.