నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టీ స్వర్ణపురి కాలనీ లో కొత్తగా ఏర్పాటైన కాలనీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ హెచ్ ఎం టీ స్వర్ణపురి కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అన్నారు. ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం టీ స్వర్ణపురి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రావు , ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దశరథ్ రావు, విద్యానంద చారి, రమేష్ చంద్ర, సురేష్, విరూపక్షయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.