నమస్తే శేరిలింగంపల్లి: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు బిజెపి సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్ లోని అరవింద్ స్వగృహంలో ఆయనను మంగళవారం కలిశారు. ఎంపీ అరవింద్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్, శేరిలింగంపల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, కర్చర్ల ఎల్లేష్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, బిజెపి నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, అలిగెరి అర్జున్, శ్రీనివాస్, జాజేరావు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
