నమస్తే శేరిలింగంపల్లి: బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీల పితామహుడు బిపి మండల్ బిందేశ్వర్ ప్రసాద్ కు భారతరత్న ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. నేతాజీ నగర్ కాలనీలో భేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం బీపీ మండల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఎంతో కృషి చేశారన్నారు. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ల కల్పనపై కృషి చేసిన మహానీయులు బీపీ మండల్ అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని భేరి రాంచందర్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాగం కృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి నియోజక అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, కృష్ణ కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్, రజక సంఘం అధ్యక్షుడు నరేందర్, రాజు, అశోక్, శివ, రాములమ్మ, మల్లమ్మ, పంతం వెంకటేష్. బి యాదయ్య, బిసి నాయకులు పాల్గొన్నారు.
