న్యూ సైబర్ వ్యాలీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ పర్య‌ట‌న

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ సైబర్ వ్యాలీలో స్థానికుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఎంపీ రంజిత్ రెడ్డితో క‌లిసి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శ‌నివారం ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను త్వ‌ర‌లోనే చేపట్టి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య లేకుండా చూస్తామ‌న్నారు. అలాగే రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా హై టెన్ష‌న్ విద్యుత్ లైన్ల‌న దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేప‌డుతామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు సాంబశివరావు, రహమాన్, ఖాసీం, సత్య రెడ్డి, కాజా ఉమా ప్రభాకర్, అంకారావు, ముక్తార్, కృష్ణ యాదవ్, భార్గవ్, ప్రసాద్, కాలనీ వాసులు జయప్రకాష్, వెంకటేశ్వర్లు, రాజా, మురళి మోహన్, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

న్యూ సైబర్ వ్యాలీలో ప‌ర్య‌టిస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
కాల‌నీ వాసుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here